టీవీటీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాళ్ల వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి,మిర్యాలగూడ జనవరి 27:
సామాన్యుడిగా మొదలై సాయం చేసే స్థాయికి ఎదిగిన ప్రస్థానం తనది. కష్టాలకే పరీక్ష పెట్టి గెలిచిన ప్రయాణం అతనిది.అయితే ఎన్నో ఇబ్బందులను చూసిన వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన టీవీటీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాళ్ల వెంకటేశ్వర్లు తనవంతుగా సాయం చేసేందుకు ముందుంటున్నారు.ఈ క్రమంలో ఆమనగల్లు గ్రామానికి చెందిన కనుకు దివేనమ్మ హార్ట్ స్ట్రోక్ తో మృతిచెందగా … మాజీ ఎంపిటిసి సర్పంచ్ వార్డు మెంబర్ ల చేతులుగా 5 000 రూ… ఆర్థిక సహాయం అందజేసి కుటుంబాన్ని ఓదార్చారు.ఈ సందర్భంగా గ్రామంలో ఏ ఆపద, అవసరమైన తల్లి లాంటి తన ఊరికి పెద్ద దిక్కుగా ఉంటానని వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వల్లంపట్ల అబ్రహం,ముండ్ల కళ్యాణ్ వార్డు నెంబర్ గంగయ్య,కోల రమేష్,మెరుగు సురేష్,అనిల్ కుమార్,సతీష్,గ్రామపంచాయతీ కార్యదర్శి,ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent Comments