Monday, January 26, 2026

బీసీ వర్గాలకు టిటిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాలని చంద్రబాబు కి విన్నపం..!

టీటీడీపీ నాయకులు పోగుల సైదులు గౌడ్

ప్రజాశక్తి, మిర్యాలగూడ అక్టోబర్ 13:
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మరుగు బలహీనవర్గాలకు రాజకీయ అవకాశం కల్పించడమే లక్ష్యంగా స్థాపించబడిన తెలుగుదేశం  పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలకు అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర నాయకుల  పోగుల సైదులు గౌడ్  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ తో మొదలు చేసి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలపడిన పరిస్థితులను పేద బడుగు బలహీన వర్గాల రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందన్న సంకేతాలు రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక ద్వారా తెలియజేయాలని కోరారు.తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనే పేరు మరొకసారి ప్రజలకు తెలియచెప్పల్సిన అవసరం ఉందన్నారు.దానికి అనుగుణంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇటువంటి ప్రలోభాలకు తలగకుండా పార్టీ కోసం కష్టపడిన బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించి తెలంగాణలో పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు .బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీ కష్ట సమయంలో కూడా అండగా ఉన్నవారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కర అంజిబాబు యాదవ్, నాయకులు జయరాజు, మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!