
హైదరాబాద్, మన ప్రజాశక్తి , డిసెంబర్ 24
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, జనవరి 1వ తేదీ ఒంటిగంట వరకు బార్లు తెరిచి ఉంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.సాధారణంగా అమల్లో ఉన్న సమయ పరిమితులకు మినహాయింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు.అయితే ఈ అనుమతి ఒక్కరోజుకే పరిమితమని స్పష్టం చేసింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.తాగి డ్రైవింగ్, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ, అన్ని జిల్లాల్లో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Recent Comments