వేములపల్లి,ప్రజాశక్తి ఏప్రిల్ 14:
మహానీయుల చరిత్ర చదవాలి,మహానీయుల చరిత్ర చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని మెరుగు జానీ అన్నారు.వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు మహారాజుల కాలనీ యువ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మహనీయుల చరిత్ర చదవాలని,మహనీయుల చరిత్ర వల్ల జ్ఞానం పెరుగుతుందన్నారు.అంబేదర్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు.బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు.అనంతరం తక్కెళ్ళపల్లి శ్యామ్ మాట్లాడుతూ మనుషుల్ని మనుషులుగా చూడని ఈ సమాజంలో మనుషులంతా సమానమేనని,తాను రచించిన రాజ్యాంగం ద్వారా నిరూపించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు.అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని అన్నారు.అంబెద్కర్ రాజ్యాంగం రచించారని ఆయన చూపిన మార్గంలో మన మంతా ముందుకు సాగాలని తెలిపారు.సామాజిక వివక్షత లేని సమాజమే నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిక్షమాచారి,వల్లంపట్ల ప్రమోద్,అంబేద్కర్,ప్రసాద్,భరత్, సుందర్, ఆవిరెండ్ల అనిల్,మాతంగి గోపి,శాంతికుమార్,మహేష్,గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు.


