30.9 C
Hyderabad
Saturday, July 25, 2026

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

*ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి*

*జగ్జీవన్ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం*

వేములపల్లి,ప్రజాశక్తి ఏప్రిల్ 5:

ఆమనగల్లు గ్రామం మహారాజుల కాలనీలో మెరుగు జానీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఫోటోకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం తక్కెళ్ళపల్లి శ్యామ్ మాట్లాడుతూ భారత మొట్టమొదటి దళిత ఉప ప్రధాని డా,,బాబు జగ్జీవన్ రామ్…దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేస్తూనే మరోవైపు సామాజిక న్యాయం,బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు.ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచిన బుడుగు బలహీన వర్గాలకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని అంబేద్కర్ పోరాడితే జగ్జీవన్ రావు చట్టసభల్లో దాన్ని అమలు చేయించిన గొప్ప పోరాట యోధుడన్నారు.ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రమోద్,కొత్తపేల్లి వెంకన్న,సుధాకర్,అంబేద్కర్,ప్రసాద్,నరసయ్య,వల్లంపట్ల భరత్,రాములు,శ్రీను,లింగయ్య,సతీష్,గోపి,దానయ్య,సుందర్,గుర్గయ్య,వెంకన్న,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles